అంబానీలు అభివృద్ధి చెందితే సరిపోదు: హైకోర్టు మాజీ జడ్జ్

అంబానీలు అభివృద్ధి చెందితే సరిపోదు: హైకోర్టు మాజీ జడ్జ్

మానవాళి రక్షణకు ప్రకృతి ఎంతో అవసరమని అన్నారు హైకోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి చంద్ర కుమార్. మానవ జాతి వినాశనానికి పెద్ద కంపెనీలు, ఆయుధాల వ్యాపారం చేసే వారు కారణం అవుతున్నారని ఆయన అన్నారు. మేధావులను యువత అదర్శంగా తీస్కున్నప్పుడే దేశం అభిరుధ్ది చెందుతుందని చెప్పారు. ఒక గుడిస అంటుకుంటే మనకెందుకులే అని అనుకోకూడదని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని సూచించారు.

అంబానీలు, అదానీలు అభివృద్ది చెందితే దేశం అభివృద్ధి చెందినట్టు కాదన్నారు చంద్ర కుమార్. దేశంలో ప్రతీ ఒక్కరూ బాగుపడాలని అప్పుడే అసలైన అభివృద్ది జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం తాగే పాల దగ్గరినుంచి ప్రతీ ఒక్కటీ కల్తీ లవుతున్నాయని ఆయన అన్నారు. వీటన్నింటికీ అన్వాయుదాల ప్రయోగం, బాస్కెట్, మైనింగ్ తవ్వకాలే కారణమని చెప్పారు.