V6 News

సీజేఐకి రాజకీయాలు అంటగడుతున్నరు.. జస్టిస్‌‌‌‌ సూర్యకాంత్‎కు మద్దతుగా రిటైర్డ్‌‌‌‌ న్యాయమూర్తులు

సీజేఐకి రాజకీయాలు అంటగడుతున్నరు.. జస్టిస్‌‌‌‌ సూర్యకాంత్‎కు మద్దతుగా రిటైర్డ్‌‌‌‌ న్యాయమూర్తులు

న్యూఢిల్లీ: చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ సూర్యకాంత్‌‌‌‌ ఇటీవల రోహింగ్యా శరణార్థులపై చేసిన వ్యాఖ్యలను కొంతమంది తప్పుబట్టడంపై మాజీ న్యాయమూర్తుల బృందం మండిపడింది. న్యాయవ్యవస్థను కించపరిచేందుకు, సీజేఐకి రాజకీయాలను అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని 44 మంది రిటైర్డ్‌‌‌‌ న్యాయమూర్తులు పేర్కొన్నారు. బుధవారం ‘సుప్రీంకోర్టును అవమానించడం ఆమోదయోగ్యం కాదు’అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో మాజీ న్యాయమూర్తులు మాట్లాడారు. 

కోర్టు వ్యాఖ్యలను వక్రీకరించడాన్ని, న్యాయమూర్తులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించి విదేశీయులు.. ఇండియాకు చెందిన గుర్తింపు, సంక్షేమ పత్రాలను అక్రమంగా సేకరించడంపై దర్యాప్తునకు సంబంధించి సిట్‌‌‌‌ ఏర్పాటు చేయడాన్ని సమర్థిస్తున్నట్లు తెలిపారు.