 
                                    పోలీస్ సంస్కరణ దినోత్సవం పురస్కరించుకుని సౌత్ వెస్ట్ జోన్ ఆధ్వర్యంలో మెహిదీపట్నం రేతిబౌలి రూప్ గార్డెన్లో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. 60 కంపెనీలు పాల్గొన్న ఈ మేళాలో 1000 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. వారిలో 500 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయని డీసీపీ చంద్రమోహన్ తెలిపారు. ఏసీపీలు, ఇన్స్పెక్టర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

 
         
                     
                     
                    