Retro vs HIT 3 Box office: రెట్రో vs HIT 3 బాక్సాఫీస్.. ఫస్ట్ డే కలెక్షన్స్.. టాప్లో ఎవరంటే?

Retro vs HIT 3 Box office: రెట్రో vs HIT 3 బాక్సాఫీస్.. ఫస్ట్ డే కలెక్షన్స్.. టాప్లో ఎవరంటే?

హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘రెట్రో’(Retro).పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్. తమ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన (మే1న) పాన్ ఇండియా భాషల్లో విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా తొలిరోజు వసూళ్లతో పర్వాలేదనిపించింది. 

సాక్నిల్క్ ప్రకారం, రెట్రో కలెక్షన్స్:

‘రెట్రో’ మూవీ ఫస్ట్ డే ఇండియా వైడ్ గా రూ.19.25 కోట్ల నెట్ కలెక్షన్స్ని సాధించినట్టుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క తమిళనాడులోనే రూ.17.25 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలిపాయి. తెలుగు వెర్షన్ రూ.1.95 కోట్లు, హిందీ వెర్షన్ మొత్తం రూ 0.05 కోట్లు సాధించింది. కంగువా సినిమా కంటే ఇది ఎక్కువే.

Also Read : రాజ్ తరుణ్-లావణ్య: కోకాపేట ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి కొనుకున్నోళ్లు వస్తున్నరంట..!

కంగువా మొదటి రోజు తమిళనాడులో రూ.14.9 కోట్లు వసూలు చేసింది. మొత్తం రూ.24 కోట్ల నెట్ సాధించింది. అయితే, భారీ బడ్జెట్ తో (సుమారుగా రూ.70 కోట్లు)తో తెరకెక్కిన రెట్రో, ఈస్థాయి వసూళ్లు సాధించడం తక్కువే. కానీ, ఈ వీకెండ్ కుదురుకుంటే మాత్రం, మంచి కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. 

రూ.82 కోట్ల బ్రేక్ ఈవెన్:

రెట్రో మూవీని సూర్య, జ్యోతిక హోమ్ బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్ మరియు స్టోన్ బెంచ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీకి  ప్రమోషన్స్, రెమ్యునరేషన్స్తో కలిపి సుమారుగా రూ.70 కోట్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం. అదే మాదిరిగా వరల్డ్ వైడ్ గా రూ.80.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుపుకుంది. తెలుగులో తొమ్మిదిన్న‌ర కోట్ల వ‌ర‌కు జ‌రిగింది. దాంతో ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రెట్రో మూవీ రిలీజైంది. 

ఇకపోతే, రెట్రోకి పోటీగా వచ్చిన హిట్ 3 తొలిరోజు రూ.19 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులో రూ.18.25 కోట్లు, తమిళంలో రూ.35 లక్షలు, కన్నడలో రూ.5 లక్షలు, హిందీలో రూ.25 లక్షలు మరియు మలయాళంలో రూ.1 లక్ష మాత్రమే సంపాదించింది.

ఈ రెండు సినిమాల నెట్ వసూళ్లను పోల్చి చూస్తే.. HIT 3 మూవీ వర‌ల్డ్ వైడ్‌గా రూ.43కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. అలాగే రూ.19కోట్ల నెట్ సాధించింది. అయితే, ఇప్పటివరకు రెట్రో గ్రాస్ కలెక్షన్స్ ఎంతనేది మేకర్స్ అనౌన్స్ చేయలేదు. కానీ, నెట్ వసూళ్ల పరంగా చూస్తే.. రెట్రో కాస్తా మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. కేవలం లక్షల్లో మాత్రమే తేడా ఉంది. అయితే, వీటి జోనర్స్ వేరైనప్పటికీ, ఒకేసారి భారీ అంచనాల మధ్య బాక్సాఫీస్ ఫైట్ కి దిగడంతో పోటీ నెలకొంది. చివరికి ఎవరు నెగ్గుతారో చూడాలి.