
రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లుగా వివాదాస్పదంగా ఉన్న కోకోపేట ఇల్లు స్వాధీనానికి కొనుగోలు దారులు వస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పుప్పాలగూడలో ఉన్న రాజ్ తరుణ్ ఇంట్లో నివాసం ఉంటున్న లావణ్య ఖాలీ చేయాల్సిందిగా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఏప్రిల్ 16న ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఇంటిని రాజ్ తరుణ్ అమ్మేయగా.. లావణ్య ఖాళీ చేయకుండా అక్కడే ఉంటున్నది.
పుప్పాలగూడలో ఉన్న ఇంటిని జనవరి 10, 2025 లో రాజ్ తరుణ్ అమ్మేశాడు. కొనుగోలు దారులు ఇల్లును స్వాధీనం చేసుకోవడానికి గత కొంత కాలంగా భయపడుతున్నారు. గతంలో స్వాధీనం చేసుకోవడానికి వెళ్తే.. కేసు పెడతానని లావణ్య బెదిరించిందని... ఆమె ఉండగా స్వాధీనం చేసుకోలేమని చెప్పారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఉంటేనే ఆ ఇల్లును స్వాధీనం చేసుకుంటామని తేల్చి చెప్పారు.
అయితే ఏప్రిల్ 16న జరిగిన గొడవ తర్వాత ఆ ఇల్లును స్వాధీనం చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి. శుక్రవారం (మే2) ఇంటిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.