
హైదరాబాద్, వెలుగు: రాజ్యసభ ఉప ఎన్నికలకు దాఖలైన మూడు నామినేషన్లలో రెండింటిని తిరస్కరించామని రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం దాఖలైన నామినేషన్లు పరిశీలించగా, శ్రమజీవి పార్టీ అభ్యర్థి జాజుల భాస్కర్, ఇండిపెండెంట్ అభ్యర్థి బోజరాజు కోవల్కర్‌ను ప్రతిపాదిస్తూ, బలపరుస్తూ ఎమ్మెల్యేలు సంతకాలు చేయకపోవడంతో తిరస్కరించామన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర దాఖలు చేసిన రెండు సెట్లు సక్రమంగా ఉన్నాయని తెలిపారు. నామినేషన్ల పరిశీలనకు ఈ నెల 23 వరకు గడువు ఉండగా, అదేరోజు సాయంత్రం టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు డిక్లరేషన్ అందజేయనున్నారు.