
ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ అధికారిక X (గతంలో ట్విట్టర్) అకౌంట్ భారతదేశంలో నిలిపివేశారు. లీగల్ డిమాండ్ కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వినియోగదారులు కొంత అసౌకర్యానికి గురయ్యారు.
రాయిటర్స్ X అకౌంట్ నిలిపివేత..పూర్తి వివరాలు
అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రధాన X అకౌంట్ భారత్ ఇప్పుడు అందుబాటులో లేకుండా పోయింది. X ప్లాట్‌ఫామ్ సందేశం ప్రకారం..ఒక చట్టపరమైన డిమాండ్ కారణంగా రాయిటర్స్ అకౌంట్ శనివారం (జూలై 5, 2025న) నిలిపివేశారు. ఈ పరిణామంపై రాయిటర్స్ గానీ, భారత అధికారులు గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
రాయిటర్స్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న ప్రముఖ వార్తా సంస్థ. రాజకీయాలు, వ్యాపారం, అంతర్జాతీయ వ్యవహారాలపై బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్‌లను ఈ అకౌంట్ అందిస్తుంది.
►ALSO READ | దలైలామాకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్..దలైలామా ప్రేమ, సహనానికి ప్రతీక
రాయిటర్స్ X అకౌంట్ క్లోజ్ చేయడంతో పత్రికా స్వేచ్ఛ ,పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఏ రకమైన చట్టపరమైన డిమాండ్ వల్ల ఈ అకౌంట్ నిలిపివేశారనేదానిపై స్పష్టత లేదు. X సంస్థ గతంలో కూడా భారత ప్రభుత్వంతో కంటెంట్ తొలగింపు విషయంలో ఉద్రిక్తతలను ఎదుర్కొంది. ఈ సంఘటన కూడా అదే కోవలోకి వస్తుందా లేదా అనేది వేచి చూడాలి.
రాయిటర్స్, థామ్సన్ రాయిటర్స్ వార్తా, మీడియా విభాగం. 200 కంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రాంతాల్లో 2,600 మంది జర్నలిస్టులు ఉన్నారు. భారతదేశంలో ముంబై, బెంగళూరు ,ఢిల్లీతో సహా అనేక ప్రాంతాల్లో కార్యాలయాలు రాయిటర్స్‌కు ఉన్నాయి. ఈ విషయంలో మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.