కేయూ విద్యార్థి సునీల్ నాయక్ ది ప్రభుత్వ హత్య

కేయూ విద్యార్థి సునీల్ నాయక్ ది ప్రభుత్వ హత్య

కాకతీయ వర్శిటీ విద్యార్థి సునీల్ నాయక్ మృతిపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. సునీల్ నాయక్ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. కేసీఆర్ అండ్ కో ఉద్యమ సమయంలో విద్యార్థులను రెచ్చగొట్టి వారి చావులకు కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వకుండా మరోసారి వాళ్ల చావులకు కారణమవుతున్నారన్నారు. 

రాష్ట్రంలో లక్షా 91 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని PRC చెప్పిందన్న రేవంత్ రెడ్డి.. ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన TSPSC కమిటీకే దిక్కులేదని విమర్శించారు. రెండోసారి అధికారంలోకి వచ్చి 27 నెలలైనా నిరుద్యోగ భృతి ఊసేలేదన్నారు. ప్రభుత్వం వెంటనే లక్షా 91 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు.. ఏప్రిల్ నెల నుంచే నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే యువతను కూడగట్టి ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు ఎంపీ రేవంత్ రెడ్డి.