గాంధీ భవన్ లో ముగిసిన మునుగోడు ఆశావహుల భేటీ

గాంధీ భవన్ లో ముగిసిన మునుగోడు ఆశావహుల భేటీ

గాంధీ భవన్ లో నిర్వహించిన మునుగోడు ఆశావహుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఆశావహుల వ్యక్తిగత అభిప్రాయాలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలుసుకున్నారు. టికెట్ ఎవ్వరికిచ్చినా సమిష్టిగా పని చెయ్యాలని నేతలు సూచించారు. ఆశావాహులతో భేటీ అనంతరం హైదర్ గూడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం  ఠాగూర్ తో  రేవంత్ రెడ్డి , భట్టి విక్రమార్క, రాంరెడ్డి దామోదర్ రెడ్డి భేటీ అయ్యారు.

మునుగోడులో ప్రధానంగా పాల్వాయి స్రవంతి రెడ్డి, చలమల కృష్ణారెడ్డి మధ్య టికెట్ కోసం తీవ్ర పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల బలాలు, బలహీనతలపై సాయంత్రం ఏఐసీసీకి నివేదిక  పంపించనున్నారు. అనంతరం ఏఐసీసీ ఆమోదించిన వాళ్ళను అభ్యర్థిగా ప్రకటించనున్నారు.  మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉండటంతో అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపాలనే యోచనలో కాంగ్రెస్ ఉంది.