ప్రగతిభవన్.. ఇకపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రజా భవన్ : రేవంత్ రెడ్డి

ప్రగతిభవన్.. ఇకపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రజా భవన్ : రేవంత్ రెడ్డి

ప్రజల తీర్పునకు లోబడి కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు బీఆర్ఎస్ పార్టీ సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమానికి అన్ని పార్టీలకు ఆహ్వానం పంపుతామని చెప్పారు. తెలంగాణలో ప్రజల హక్కులను, పౌర హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. సీపీఐ,సీపీఎం పార్టీలతో పాటు కోదండరాం పార్టీని (టీజేఎస్) ను కూడా కలుపుకొని ముందుకెళ్తామన్నారు. కోదండరాం సలహాలు, సూచనలు తీసుకుని ముందుకెళ్తామన్నారు. 

ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తుందని తాము ఆశిస్తున్నామని చెప్పారు రేవంత్ రెడ్డి. సచివాలయ గేట్లు సామాన్యులకు తెరుచుకుంటాయని చెప్పారు. గతంలో మాదిరిగా పద్ధతులు ఉండవన్నారు. ‘‘ ఇకపై ప్రగతిభవన్ డాక్టర్ అంబేడ్కర్ ప్రజా భవన్ గా మారుతుంది. సామాన్యులకు పరిపాలనను అందుబాటులోకి తీసుకురావడానికి సచివాలయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇక నుంచి అది ప్రగతి భవన్ కాదు.. అది ప్రజా భవన్. సామాన్య ప్రజలందరూ రావడానికి అవకాశం ఉంటుంది. అది ప్రజల ఆస్తి.. ప్రజల కోసమే వినియోగిస్తాం.. తెలంగాణలో గతానికి, భవిష్యత్తుకు భిన్నంగా మార్పు ఉంటుంది’’ అని రేవంత్ రెడ్డి చెప్పారు.