బీఆర్ఎస్, బీజేపీ కుతంత్రాలు కాంగ్రెస్ గెలుపును ఆపలేవు : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్, బీజేపీ కుతంత్రాలు కాంగ్రెస్ గెలుపును ఆపలేవు : రేవంత్ రెడ్డి

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చెన్నూరు, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థుల ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ దాడులపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించారు. 

తన చీకటి మిత్రుడు కేసీఆర్ గెలుపు కోసం దింపుడు కళ్లం ఆశతో మోదీ తన పెంపుడు కుక్కల్లాంటి ఈడీ, ఐటీలను కాంగ్రెస్ నేతల ఇండ్లపైకి ఉసి గొల్పుతున్నారని ఆరోపించారు. వివేక్ వెంకటస్వామి ఇండ్లపై దాడులను తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్, బీజేపీ కుతంత్రాలు కాంగ్రెస్ గెలుపును ఆపలేవు అని చెప్పారు. 

2023, నవంబర్ 21న మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి జీ. వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ ఇండ్లు, ఆఫీసులపై ఐటీ, ఈడీ అధికారుల సోదాలు జరిగాయి.