
టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో అభివృద్ధి మేడిపండులా ఉందని విమర్శించారు. మంత్రులంతా నామ్ కే వాస్తే ఉన్నారని అన్నారు. వారి శాఖలను నిర్వర్తించడంలో మంత్రులు విఫలమయ్యారని విమర్శించారు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ముంచారని అన్నారు. ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేయడం మానేయాలన్నారు. విద్యుత్ కు సంబంధించి ఇంత వకు ఈఆర్సీని నియమించకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ ఎస్ వైఫల్యాలపై కాంగ్రెస్ దీర్ఘకాలిక కార్యాచరణతో పోరాడుతుందన్నారు రేవంత్.