కేసీఆర్ సర్కార్ది నిరంకుశ పాలన: రేవంత్ రెడ్డి

కేసీఆర్ సర్కార్ది నిరంకుశ పాలన: రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ వైఖరిపై.. తెలంగాణ పోలీసుల తీరుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ నిరంకుశ పాలన చేస్తోందని విమర్శించారు. ప్రవళ్లికది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని చెప్పారు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగ యువత నరకం అనుభవిస్తోందని అన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రవళ్లిక గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గాంధీ భవన్​లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. 

ప్రవళిక విషయంలో ప్రెస్ మీట్ పెట్టిన డీసీపీపై కేసు పెడతామన్నారు. అమ్మాయి ఫోన్ సీజ్ చేస్తే సమాచారం ఎలా బయటకు వచ్చిందని నిలదీశారు. ఫోన్ ఓపెన్ చేయాలంటే.. కోర్టు అనుమతి తీసుకోవాలని అన్నారు. ఫోన్ సమాచారం పై ఫోరెన్సిక్ నివేదిక రాక ముందే.. డీసీపీ ప్రెస్ మీట్ ఎలా పెడతారని నిలదీశారు. డీసీపీ పై ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేస్తామని తెలిపారు. 

మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళదామని సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామని రేవంత్‌ సవాల్‌ విసిరారు. ఈ మేరకు ఇవాళ(అక్టోబర్ 17) మధ్యాహ్నం పార్టీ నేతలతో కలిసి రేవంత్‌ గన్‌పార్క్‌ వద్దకు వెళ్లగా.. ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

Also Read :- అది మాకు పవిత్ర గ్రంథంతో సమానం

ఏం జరగిందంటే..

హైదరాబాద్ గన్​పార్కు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా ఉండాలని కేసీఆర్‌కు ఛాలెంజ్ విసిరిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమరవీరుల ముందు ప్రమాణం చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయణ్ను అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. రేవంత్ అరెస్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా ఉండాలని కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేద్దామని ఛాలెంజ్ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ (అక్టోబర్ 17) హైదరాబాద్ లో గన్ పార్కు వద్దకు వచ్చిన రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలో అక్కడి నుంచి తరలించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

పోలీసుల తీరుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు, కార్యకరర్తలు రోడ్డుపై బైఠాయించారు. పలువురు నేతలు, కార్యకర్తలను వాహనాల్లో అక్కడి నుంచి తీసుకెళ్లారు.