దేశంలోనే రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎం : శంకర్ రావు

దేశంలోనే రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎం : శంకర్ రావు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే ది బెస్ట్ సీఎం అని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్ రావు ప్రశంసించారు. శనివారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకొని శనివారంతో మూడేండ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. పీసీసీ చీఫ్‌గా తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు వచ్చినందుకు రేవంత్‌కు శంకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

 రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ అవడం మంచి నిర్ణయమని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ప్రస్తుతం ఐదు అమలవుతున్నాయని, ఆరో గ్యారంటీ ఆగస్టులో అమలు కానుందని చెప్పారు. దేశ సమగ్రత కోసం గాంధీ కుటుంబం త్యాగం చేసిందని.. కుల, మతాలు, భాషతో సంబంధం లేకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ జోడో యాత్ర చేసి, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు మంచి ఊపు తెచ్చారని ఆయన అన్నారు.