ఎల్లూరులో ఉద్రిక్తత..ఎంపీ రేవంత్ రెడ్డికి గాయం

ఎల్లూరులో ఉద్రిక్తత..ఎంపీ రేవంత్ రెడ్డికి గాయం

నాగర్ కర్నూల్ లో ఉద్రికత్త నెలకొంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు బ్లాస్టింగ్ తో నీట మునిగిన కల్వకుర్తి పంప్ హౌస్ లను పరిశీలించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

కల్వకుర్తి (ఎల్లూరు) పంపుహౌస్‌  నీట మునిగిపోయింది. ప్రభుత్వ నిర్వాకంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. పాలమూరు – రంగారెడ్డి ఫస్ట్‌ పంపుహౌస్‌తో పాటు అప్రోచ్‌ చానల్‌ కోసం భూగర్భంలో చేపట్టిన పేలుళ్లతోనే ఈ ప్రమాదం జరిగింది. కల్వకుర్తి పంపుహౌస్​లో  డ్రాఫ్ట్‌ ట్యూబ్‌లను ఆనుకొని ఉన్న గోడల్లో పగుళ్లు వచ్చి మోటార్లు మొత్తం నీటిలో మునిగిపోయాయి. మూడో మోటారు దెబ్బతిని దాని నుంచి నీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి. మూడో మోటారు బేస్మెంట్‌ కూడా పగిలిపోయినట్టు తెలుస్తున్నది. పాలమూరు ప్రాజెక్టులో అండర్‌ గ్రౌండ్‌ పంపుహౌస్‌ నిర్మిస్తే కల్వకుర్తి పంపుహౌస్‌ దెబ్బతింటుందని సీనియర్‌ ఇంజనీర్లు హెచ్చరించినా.. రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. దీనిపై సమాచారం అందుకున్న కాంగ్రెస్ నేతలు ప్రాజెక్ట్ ను సందర్శించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్, మల్లురవి లను బలవంతంగా అరెస్ట్ చేసి తెలకపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కాలికి గాయమైంది. ప్రభుత్వం కోట్లాది రూపాయాల్ని వృదా చేస్తుందని ప్రశ్నించిన పాపానికి తమపై దౌర్జన్యం చేయడం దారుణమంటూ మండిపడ్డారు.