- సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితం దేశానికి ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రజాపాలన అందిస్తున్నామని సీఎం తెలిపారు.
ఆదివారం బాబూ జగ్జీవన్ రామ్119వ జయంతి సందర్భంగా సీఎం ఆయనను గుర్తు చేసుకున్నారు. దళితుల హక్కుల కోసం జగ్జీవన్ రామ్ జీవితాంతం పోరాడారని గుర్తుచేశారు. పేదరికంలో పుట్టినా, తన పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు.
