జ్యోతిరావు పూలేకు సీఎం రేవంత్ రెడ్డి నివాళి

జ్యోతిరావు పూలేకు సీఎం రేవంత్ రెడ్డి నివాళి

న్యూఢిల్లీ, వెలుగు: కుల వివక్షకు వ్యతరేకంగా, మహిళల హక్కుల కోసం అహర్నిశలు శ్రమించిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి సీఎం పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పూలే చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు ఎంపీ మల్లు రవి, పార్టీ నేత రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.