సిగ్గుమాలిన రాజకీయాలు అవసరమా కేటీఆర్?

V6 Velugu Posted on May 16, 2021

సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రి దగ్గర ఉన్న పేదలకు అన్నదానం చేసేందుకు వెళ్తున్న ఎంపీ రేవంత్ రెడ్డిని బేగంపేటలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. మంత్రి కేటీఆర్ నుంచి ఆదేశాలు ఉన్నాయని, అందుకే ఆయనను అనుమతించలేమని పోలీసులు చెప్పారు. రేవంత్ రెడ్డి వాహనం ముందుకు వెళ్లకుండా పోలీసులు రౌండప్ చేశారు. దాంతో రాతపూర్వక ఆదేశాలు చూపాలని రేవంత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదోడి ఆకలిపై రాజకీయాలు చేస్తారా? సిగ్గుందా కేటీఆర్ అని దుయ్యబట్టారు. లాక్ డౌన్ టైంలో పేదలకు పట్టెడు అన్నం పెట్టడం నేరమా అని క్వశ్చన్ చేశారు. తాను స్థానిక ఎంపీనని, తనను అడ్డుకోమని చెప్పే అధికారం ఎవరిచ్చారనీ ఫైర్ అయ్యారు. సామాజిక సేవలోనూ రాజకీయాలు వెతికే ప్రయత్నం దుర్మార్గమని విమర్శించారు.

Tagged Congress, MP Revanth reddy, telangana police, poor people, Gandhi Hospital, free food, Telangana Minister KTR

Latest Videos

Subscribe Now

More News