హైదరాబాద్ ను చెత్త నగరంగా చేశారు

హైదరాబాద్ ను చెత్త నగరంగా చేశారు

పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు డైరెక్ట్ గా జరుగుతుంటే..జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ వర్చువల్ గా జరపడం ఏంటని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జూమ్ మీటింగ్ వెనక దురుద్దేశాలున్నాయని విమర్శించారు. మీడియాను జీహెచ్ఎంసీలోకి  ఎందుకు అనుమతించట్లేదన్నారు. సమస్యలపై జీహెచ్ఎంసీ పాలకమండలిని... విపక్షాలు నిలదీయకుండా ఉండేందుకే ఈ విధంగా చేశారన్నారు. ఎన్నికల ముందు హామీలు మర్చిపోయారని మండిపడ్డారు. హైదరాబాద్ ని చెత్త నగరంగా తయారు చేశారన్నారు రేవంత్. ఫ్యాషన్ షో క్యాట్ వాక్..కేటీఆర్ క్యాట్ వాక్..రెండు ఒకేలా ఉంటాయన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న మెట్రో సిటీస్ లో హైదరాబాద్ కి స్థానం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో జిహెచ్ఎంసి కి క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అవార్డులు వచ్చాయని.. ఇపుడు చెత్త నగరంగా మారిందన్నారు. నిదులు రాబట్టడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో జీహెచ్ఎంసీ అప్పుల్లోకి వెళ్లిందన్నారు.