హైదరాబాద్లో పరిశ్రమలకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్: రేవంత్రెడ్డి

హైదరాబాద్లో  పరిశ్రమలకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్: రేవంత్రెడ్డి

హైదరాబాద్లో పరిశ్రమలకు స్థాపనకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు బీహెచ్ ఈఎల్ స్థాపనతో తెలంగాణ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు కృషి చేశారని చెప్పారు. ఆనాడు ఎందరో కాంగ్రెస్ నాయకులు తమ భూములను పరిశ్రమల కోసం ఇచ్చారని తెలిపారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం  భూములను లాక్కోవడం, ఆక్రమించడమే లక్ష్యంగా పనిచేసిందన్నారు. ఎంతో అభివృద్ధి చేస్తారని నమ్మి రెండుసార్లు బీఆర్ ఎస్ పార్టీకి అధికారం అప్పజెప్పారు.. అభివృద్ది జరగలేదు..ఈ సారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి .. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామన్నారు రేవంత్ రెడ్డి.  

శేరిలింగంపల్లి లో రోడ్ షో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పేద వర్గాలకు సేవలందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు.పదేళ్లలో ప్రజాసమస్యలను సీఎం కేసీఆర్ గాలికొదిలేశారని ఆరోపించారు. కనీసం ఒక్కసారి కూడా సచివాలయానికి వచ్చి ప్రజల అభ్యర్థలను పట్టించుకోలేదన్నారు. ప్రజలకోసం ఏనాడు ప్రగతి భవన్ గేట్లు తెరుచుకోదన్నారు రేవంత్ రెడ్డి. గద్దర్ లాంటి ప్రజానాయకుడిని మూడు గంటలు ప్రగతి భవన్ గేటు ముందు నిలబెట్టాడు తప్పా.. లోపలికి అడుగు పెట్టనియ్యలేదని అన్నారు రేవంత్ రెడ్డి. 
ఉద్యోగాల భర్తీలో అన్ని అవకతకలే... 15 పరీక్షలు నిర్వహించి .. పేపర్ లీక్  చేసి.. పరీక్షలు రద్దు చేసి.. 30 లక్షల  మంది నిరుద్యోగుల జీవితాలతో సీఎం కేసీఆర్ ఆడుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిరుద్యోగుల భవిష్యత్ తో ఆడుకున్న సీఎం కేసీఆర్ ను గద్దె దించాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగాలకోసం కొట్లాడి తెచ్చుకున్నర తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో అందరికి ఉద్యోగాలు వచ్చాయి తప్పా.. ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం రాలేదని విమర్శించారు రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటించి.. ఏటా ఉద్యోగాల భర్తీ చేస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.