కాంగ్రెస్ అధికారంలోకి వస్తే SC , ST వర్గీకరణ: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే SC , ST వర్గీకరణ: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే SCతోపాటు ST వర్గీకరణ చేస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రెండువర్గాల్లోనూ దామాషా పద్దతిలో వర్గీణకరణ చేస్తామని రేవంత్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ఏ ఒక్కరి కోసం కాదన్న రేవంత్.. వర్గీకరణ పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. ఒకరికి మద్దతు ఇచ్చి ఇంకోరిని ప్రశ్నించడం సరికాదని రేవంత్ అన్నారు. వర్గీకరణపై ఇప్పటికే రాహుల్ గాంధీ  స్పష్టంగా చెప్పారన్నారు.

ALSO READ :తెలంగాణలో మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శం: మంత్రి కేటీఆర్

ఎస్సీ వర్గకీరణపై పంచుతం,  పంచాయతీ తెంచుతాం ఇదే తమ నినాదం అని  రేవంత్ చెప్పారు. అటు కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డిని ఎస్సీ వర్గకరణపై ఎందుకు అడగట్లేదని రేవంత్ ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి కేంద్రమంత్రి వెంకయ్య నాయకుడు వర్గీకరణపై ఇచ్చిన హామీ ఏమైందని రేవంత్ ప్రశ్నించారు. అటు జనరల్ సీట్లలోనూ దళిత గిరిజనులకు అవసరం మేర టికెట్లు ఇస్తామన్నారు రేవంత్.