వరిదీక్షలో రైతు కష్టాలపై ఆకట్టుకున్న పాట

వరిదీక్షలో రైతు కష్టాలపై ఆకట్టుకున్న పాట

వడ్ల కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఇందిరాపార్క్ దగ్గర కాంగ్రెస్  వరిదీక్ష రెండో రోజు కొనసాగుతోంది. కల్లాల్లో రైతులు అవస్థలు పడుతుంటే.. TRS ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనాలని, తడిసిన ధాన్యానికి కూడా మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. తరుగుపేరుతో రైతులపై దోపిడీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ వరి దీక్షకు TJS అధ్యక్షుడు కోదండరామ్ మద్దతు తెలిపారు. దీక్షా శిబిరంలో 92 ఏళ్ల రైతు రాంరెడ్డి అన్నదాతల కష్టాలపై పాడిన పాట ఆకట్టుకుంది. రేవంత్.. రైతు రాంరెడ్డి కాళ్లు మొక్కారు. సాయంత్రం 5 గంటల వరకు వరిదీక్ష చేయనున్నారు  నేతలు.