రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి బృందం భేటీ

రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి బృందం భేటీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బృందం భేటీ అయింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల, గీతారెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. 40లక్షల మందికి కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం పూర్తైన సందర్భంగా రాహుల్తో సమావేశమైన నేతలు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని రేవంత్ రెడ్డి అన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తలందరికీ రూ.2లక్షల ప్రమాద బీమా ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు పార్టీ మెంబర్ షిప్ తీసుకున్న 40క్షల మంది కార్యకర్తల బీమా ప్రీమియం కింద చెల్లించాల్సిన రూ.6.5కోట్ల ప్రీమియం చెక్కును రాహుల్ గాంధీ చేతుల మీదుగా న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి అందజేశారు.

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని రాహుల్ గాంధీ సూచించినట్లు చెప్పారు. ఏప్రిల్ ఒకటి నుంచి ప్రజా ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించామని, రాహుల్ గాంధీని రాష్ట్రంలో పర్యటించాలని కోరామని అన్నారు.

For more news..

టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ రిలీజ్

వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన కోదండరాం