
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్ధితి పైన టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. మోడీ ప్రభుత్వం ఆర్మీ విద్యార్థుల మనోభావాలకు భిన్నంగా చేసిన నిర్ణయ ఫలితం ఇదని అన్నారు. దేశభక్తితో సైన్యంలో చేరడానికి సిద్ధపడిన యువత ఇంతలా ఆందోళనకు దిగారంటే ‘అగ్నిపథ్’ సరైనది కాదని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు, పాత విధానాన్నే కొనసాగించాలని రేవంత్ రెడ్డి సూచించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ రోజు జరిగిన ఘటన దురదృష్టకరం.
— Revanth Reddy (@revanth_anumula) June 17, 2022
మోడీ ప్రభుత్వం ఆర్మీ విద్యార్థుల మనోభావాలకు భిన్నంగా చేసిన నిర్ణయ ఫలితం ఇది. దేశభక్తితో సైన్యంలో చేరడానికి సిద్ధపడిన యువత ఇంతలా ఆందోళనకు దిగారంటే ‘అగ్నిపథ్’ సరైనది కాదని ప్రభుత్వం,పాత విధానాన్నే కొనసాగించాలి. pic.twitter.com/DotzZcpXCL