మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియెట్​కు.. మే లో లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు

మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియెట్​కు.. మే లో లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్, వెలుగు : ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత రేవంత్​రెడ్డి డాక్టర్​ బీఆర్​అంబేద్కర్​సెక్రటేరియెట్ కు వెళ్లనున్నారు. మధ్నాహ్నం 3 గంటలకు సీఎం హోదాలో ఆయన సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. ఆరో అంతస్తులో ఉన్న సీఎం చాంబర్​లో ఆయన సీట్లో కూర్చొని, సీఎస్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. ఔటర్ రింగురోడ్డు టెండర్లలో జరిగిన అవినీతిపై అప్లికేషన్​ఇవ్వాలని ఈ ఏడాది మే నెలలో రేవంత్​రెడ్డి సెక్రటేరియెట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆయనను కిలోమీటర్​దూరంలోనే అడ్డుకున్నారు. ఇప్పుడు ఏకంగా సీఎం హోదాలో పోలీసులు, భారీ భద్రతా కాన్వయ్​మధ్య రేవంత్​సెక్రటేరియేట్ లోకి గురువారం అడుగుపెట్టబోతున్నారు.

కొత్త సచివాలయం ప్రారంభం తర్వాత కొన్నిసార్లు అక్కడ సమీక్షలు నిర్వహించిన కేసీఆర్.. నేతలతో పాటు సామాన్యులెవర్నీ అందులోకి అడుగుపెట్టనివ్వలేదు. రేవంత్‌‌ రెడ్డి, సీతక్క లాంటి వాళ్లు సచివాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా, అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు.