తెలంగాణ ఉద్యమంలో డ్రామారావు ఎక్కడ ? : రేవంత్ రెడ్డి

తెలంగాణ ఉద్యమంలో డ్రామారావు ఎక్కడ ? : రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 2001లో రబ్బరు చెప్పులు లేని  కేసీఆర్ కుటుంబం..ఇపుడు హైదరాబాద్ చుట్టూ ఫాంహౌస్ లు కట్టుకుందని ఆరోపించారు. ములుగు  జిల్లాలో హత్ సే హత్ జోడో యాత్ర కొనసాగుతోంది. కాంగ్రెస్ హయాంలో 10 లక్షల ఎకరాల భూములు పంచితే నేడు హరితహారం పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల భూములు గుంజుకుంటుందని ఆరోపించారు. 

తొమ్మిదేళ్లలో 10 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రేవంత్ రెడ్డి  అన్నారు. రైతుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని ఆరోపించారు.  నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదదని విమర్శించారు. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో డ్రామారావు ఎక్కడున్నారని కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు. 2024 జనవరి 1న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే సంవత్సరంలో పోడు భూములకు పట్టాలిచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ములుగులో గిరిజన యూనివర్శిటీని తెచ్చేబాధ్యత కూడా తమదేనన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణలో సంక్షేమ రాజ్యం వస్తుందన్నారు.