కన్న కూతురునే ఎంపీగా గెలిపించుకోలేకపోయారు : రేవంత్ రెడ్డి

కన్న కూతురునే ఎంపీగా గెలిపించుకోలేకపోయారు : రేవంత్ రెడ్డి

మంత్రి కేటీఆర్ ట్వీట్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఆయన చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు. కన్న కూతురునే ఎంపీగా గెలిపించుకోలేని మీరు.. ‘జాతీయ’ నాయకుడినని డబ్బా కొట్టుకుంటున్న నేత రాజకీయ జీవితం కూడా ఓటమితోనే మొదలయ్యిందన్న సంగతి గుర్తుందా.. అని ట్వీట్ చేశారు. ఎవరన్నా గుర్తు చేయండ్రా బాబూ.. అంటూ సెటైర్ వేశారు. డ్రామా రావు అనే హ్యాష్ ట్యాగ్ ను జతచేస్తూ కేటీఆర్ ట్వీట్ ను రేవంత్ రీట్వీట్ చేశారు. 

అంతకుముందు రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. అమేథీలో సొంత పార్లమెంటు సీటును కూడా గెలవలేని అంతర్జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అని వ్యాఖ్యానించారు. అలాంటి నేత సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఆశయాలను అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రధానిగా కావాలని కలలుగంటున్న రాహుల్..  ముందుగా ఎంపీగా గెలవాలని విమర్శించారు.