రేవంత్​ రెడ్డిది ప్రజాసంక్షేమ పాలన : కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి

రేవంత్​ రెడ్డిది ప్రజాసంక్షేమ పాలన : కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి
  •     డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి

జనగామ, వెలుగు : సీఎం రేవంత్​ రెడ్డి ప్రజాసంక్షేమ పాలన సాగిస్తున్నారని జనగామ డీసీసీ ప్రెసిడెంట్​ కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చిటకోడూరు గ్రామస్థులు కొమ్మూరిని కలిశారు. తమ గ్రామానికి, చౌడారానికి మధ్య ఉన్న లో లెవల్​ బ్రిడ్జి గత వానాకాలంలో కొట్టుకుపోయిందని, దీంతో కొత్త బ్రిడ్జినిర్మించాలని వినతి పత్రం అందించారు. అనంతరం కొమ్మూరి మాట్లాడారు.

గెలిచినా ఓడినా ప్రజల మధ్యే ఉండి అభివృద్ధికి పాటు పడుతున్నానని, అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తున్నానన్నారు. నియోజకవర్గానికి ఇప్పటికే రూ 25 కోట్ల నిధులు తీసుకువచ్చానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతున్నాయన్నారు.

కార్యక్రమంలో పార్టీ నాయకులు సర్వల నరసింగరావు, బనుక శివరాజ్ యాదవ్, లింగాల నర్సిరెడ్డి, చిటకోడూర్ బ్రిడ్జి సాధన సమితి కన్వీనర్ యాసారపు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.