కాంగ్రెస్ సునామీలో బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయం: రేవంత్

కాంగ్రెస్ సునామీలో బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయం: రేవంత్

కాంగ్రెస్ సునామీలో బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమన్నారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  రాజేంద్రనగర్ సభలో మాట్లాడిన  ఆయన.. బీఆర్ఎస్ నేతలు రాజేంద్ర నగర్లో వందల ఎకరాల  భూములు అమ్ముకున్నారని ఆరోపించారు. అవినీతి పరులకు ఓటుతోనే జనం  బుద్ధిచెబుతారని చెప్పారు.  బీఆర్ఎస్ నేతలు అవినీతిలో మునిగిపోయారన్నారు. కేసీఆర్ వచ్చాక తాగుడులో రాష్ట్రం నంబర్ వన్ అయ్యిందన్నారు. తుపాకీ రాముడు చెప్పే మాటలు నమ్మొద్దని.. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు రేవంత్. 

 రాజేంద్ర నగర్ లో పేదలకు డబుల్ బెడ్రూంలు ఇవ్వలేదన్నారు రేవంత్ రెడ్డి .రాజేంద్రనగర్ నియోజకవర్గం అభివృద్ధి జరగలేదన్నారు.  ఎయిర్ పోర్టు,ఒఆర్ఆర్ కాంగ్రెస్ హయాంలో వచ్చినవేనని చెప్పారు.  కాంగ్రెస్ ను గెలిపిస్తేనే అభివృద్ధి అని అన్నారు.   కాంగ్రెస్ వస్తే రైతుబంధు రాదని కేసీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.  ఉచిత కరెంట్ పేటెంట్ ముమ్మాటికీ కాంగ్రెస్ దేనన్నారు

భూమి ఉన్న రైతులకే కాదు కౌలురైతుకు ప్రతి ఏటా 15 వేలిస్తామన్నారు రేవంత్. కాంగ్రెస్ అధికారంలో వస్తే రైతు బంధు సాయం మరింత పెంచుతామని చెప్పారు. పండించిన పంట కొనలేని కేసీఆర్ రైతుల గురించి ఆలోచిస్తాడా.? అని ప్రశ్నించారు.  తొమ్మిదేళ్లలో  బీఆర్ఎస్ ప్రభుత్వం పంటల బీమా సాయం ఇవ్వలేదన్నారు.  కే