రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో రెవెన్యూ అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఎయిర్‌పోర్ట్ కాలనీ సమీపంలోని సర్వే నెంబర్ 626/1 లో ఉన్న ప్రభుత్వ భూమిపై అధికారులు ఉక్కుపాదం మోపారు.
ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్న సుమారు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి, నిర్మాణ పనులు చేపట్టారు. ఈ విషయాన్ని గుర్తించిన శంషాబాద్ రెవెన్యూ అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు.ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా, భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసీబీల సహాయంతో ఆ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు.
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే సహించేది లేదని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
