ధరణి సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

ధరణి సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

ధరణి సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురి సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమీటీ కన్వీనర్ గా సీసీఎల్ఏ సభ్యుడు ఉంటారు. సభ్యులుగా ఎం.కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్  రేమండ్ పీటర్, అడ్వొకేట్ సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   ధరణి పోర్టల్ అంశాలను అధ్యయనం చేయనుంది. అలాగే వెబ్ సైట్ పునర్నిర్మాణంపై సిఫార్సులు చేయనుంది.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణికి వస్తున్న అత్యధిక ఫిర్యాదుల్లో ధరణికి సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతీ గ్రామం నుంచి ధరణి బాధితులు తప్పకుండా ఉంటున్నారు. ధరణి పోర్టల్ వల్ల చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలోనే పోర్టల్ అధ్యయనానికి ధరణిలోపాలపై కమిటీని వేశారు రేవంత్.