వీఆర్‌ఏలకు ప్రమోషన్స్‌ ఆపండి: రెవెన్యూ సబార్డినేట్స్‌

వీఆర్‌ఏలకు ప్రమోషన్స్‌ ఆపండి: రెవెన్యూ సబార్డినేట్స్‌
  • హైకోర్టును ఆశ్రయించిన రెవెన్యూ సబార్డినేట్స్‌ 


హైదరాబాద్, వెలుగు: విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌ (వీఆర్‌ఎ)లను జూనియర్‌ అసిస్టెంట్లుగా నియమించడం చట్ట వ్యతిరేకమని పేర్కొంటూ రెవెన్యూ శాఖలోని ఆఫీస్‌ సబార్డినేట్స్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కె.ఆదిత్య సహా పలువురు వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ మాధవీ దేవి బుధవారం విచారించారు. అయితే, ప్రభుత్వం తరఫున వాదించాల్సిన అదనపు ఏజీ రామచందర్‌ రావు అందుబాటులో లేకపోవడంతో విచారణ గురువారానికి వాయిదా పడింది. 
సుమారు 17 వేల మంది వీఆర్‌ఎలకు జూనియర్‌ అసిస్టెంట్, ఇతర పోస్టుల్లో నియమించేందుకు ప్రభుత్వం జీవో 81 ఇవ్వడం తెలంగాణ మినిస్టీరియల్‌ సర్వీస్‌ రూల్స్, తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ ఆర్డర్స్‌ – 2018 కు విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు.