రివ్యూ: మిషన్ ఇంపాజిబుల్

రివ్యూ: మిషన్ ఇంపాజిబుల్

రివ్యూ: మిషన్ ఇంపాజిబుల్
రన్ టైమ్ : 2 గంటలు
నటీనటులు: తాప్సీ,హరీష్ రోషణ్,భాను ప్రకాష్,జయతీర్థ,సత్యం రాజేశ్ తదీతరులు
సినిమాటోగ్రఫీ: దీపక్ యాగర
మ్యూజిక్ : మార్క్ .కె రాబిన్
ఎడిటింగ్ : రవితేజ గిరిజాల
నిర్మాత: నిరంజన్ రెడ్డి
రచన,దర్శకత్వం: స్వరూప్ ఆర్.ఎస్.జె
రిలీజ్ డేట్: ఏప్రిల్ 1,2022

కథేంటి?
తిరుప‌తికి ద‌గ్గ‌ర్లోని చిన్న ప‌ల్లెటూరులో ర‌ఘుప‌తి, రాఘ‌వ‌, రాజారామ్ అనే ముగ్గురు స్నేహితులున్నారు. వాళ్ల వ‌య‌సు కేవ‌లం 11 సంవ‌త్స‌రాలు. అయితే. ఊర్లో అంద‌రికంటే ఫ్యామస్ అయిపోవాల‌న్న‌ది వాళ్ల ఆశ‌. అందుకోసం కోటి రూపాయ‌లు కూడ‌బెట్టాల‌నుకుంటారు. దావూద్ ఇబ్ర‌హీంని ప‌ట్టిస్తే… రూ.50 ల‌క్ష‌ల బ‌హుమ‌తి ఇస్తామ‌న్న వార్త టీవీలో చూసి… దావూద్ ని ప‌ట్టుకోవ‌డానికి ఇంట్లో చెప్పాపెట్ట‌కుండా ముంబై బ‌య‌ల్దేర‌తారు.ఆ తర్వాత ఏం జరిగింది. దావూద్ ను పట్టుకున్నారా లేదా.? వాళ్లకు ఎదురైన సమస్యలు ఏంటి అనేది కథ.
 

నటీనటుల పర్ఫార్మెన్స్:
తాప్సీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా కనిపించింది. తన పాత్రకు న్యాయం చేసింది. మెయిన్ రోల్స్ లో నటించిన హరీష్ రోషణ్,భాను ప్రకాష్,జయతీర్థ లు మంచి పర్ఫార్మెన్స్ అందించారు.చిన్న పిల్లలే అయినా అనుభవం ఉన్న నటుల్లా రాణించారు.మిగతా వాళ్లు తమ పాత్రల పరిధిమేర నటించారు.
 

టెక్నికల్ వర్క్:
దీపక్ యాగర సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. మర్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయింది. తన మ్యూజిక్ తో సినిమాకు మంచి ఎలివేషన్లు ఇచ్చాడు.ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూయ్స్ ఫర్వాలేదు. కొన్ని పంచ్ డైలాగులు బాగానే పేలాయి.
 

విశ్లేషణ:
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ స్వరూప్ డిఫరెంట్ గా ట్రై చేశాడు. ఎలాంటి స్టార్లు లేకుండా చిన్న పిల్లలతో ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే సింపుల్ సినిమా తీసాడు. అయితే సరైన స్టార్ కాస్ట్ లేకపోవడంతో ఈ సినిమాకు బజ్ కరువైంది. చైల్డ్ ట్రాఫికింగ్ కథాంశం నేపథ్యంలో స్వరూప్ తీసిన ఈ మూవీ ఫర్వాలేదనిపిస్తుంది. ఫస్టాఫ్ కాస్త బోరింగ్ గా ఉంటుంది.అయినా ఫన్ గా సాగుతుంది. సెకండాఫ్ లో మెయిన్ కథ రివీల్ అయిన తర్వాత గ్రిప్పింగ్ గా అనిపిస్తుంది.స్వరూప్ రాసుకున్న కథనం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది.చిన్న చిన్న డిటెయిలింగ్ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ లో కూడా అక్కడక్కడా కొన్ని బోరింగ్ సన్నివేశాలున్నాయి. కానీ ఫస్టాఫ్ కంటే బెటర్. ఓవరాల్ గా ఫర్వాలేదనిపిస్తుంది.  ‘మిషన్ ఇంపాజబుల్’’ థియేటర్లలో చూడటానికి జనాలకు ఇంపాజిబులే కానీ ఓటీటీలో ఒకసారి చేసేయవచ్చు.

For More News..

ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. వలస బాటపట్టిన జనం

రెండేళ్లుగా కారులోనే నివాసముంటున్న మహిళ