ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు : బొప్పరాతి నారాయణ

ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు : బొప్పరాతి నారాయణ

జగిత్యాల, వెలుగు: ఇంటర్ విద్యలో త్వరలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టనున్నట్లు ఇంటర్ బోర్డు పరిశీలకులు రావులపల్లి వెంకటేశ్వరరావు, జగిత్యాల జిల్లా నోడల్ అధికారి బొప్పరాతి నారాయణ అన్నారు. జగిత్యాల ప్రభుత్వ బాలికలు, ఎస్ కేఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నిర్వహిస్తున్న అడ్మిషన్ ప్రక్రియను గురువారం వారు తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ ప్రతి జూనియర్ కళాశాల కాలేజీలో అడ్మిషన్ల లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. అనంతరం అడ్మిషన్ల కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్‌‌  ఆలియా మక్సుద్, కె.నాగభూషణం, తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ల సంఘం 475 జిల్లా అధ్యక్షుడు కొట్టాల తిరుపతిరెడ్డి, లెక్చరర్లు పాల్గొన్నారు.