Revolver Rita Review: రివాల్వర్ రీటా: కీర్తి సురేష్ గురి తప్పిందా? యాక్షన్ వర్కౌట్ అయ్యిందా?

Revolver Rita Review: రివాల్వర్ రీటా: కీర్తి సురేష్ గురి తప్పిందా? యాక్షన్ వర్కౌట్ అయ్యిందా?

లేడీ సూపర్‌స్టార్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్న కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'రివాల్వర్ రీటా'.  కమర్షియల్ సినిమాలతో పాటు, నాయికా ప్రాధాన్య చిత్రాలపై దృష్టి సారించిన కీర్తి.. ఈ క్రైమ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూశారు. జేకే చంద్రు దర్శకత్వంలో, సుధన్ సుందరం , జగదీష్ పళనిసామి నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ క్రైమ్ అండ్ కామెడీ మిశ్రమం ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచిందా? లేదా? చూద్దాం...

కర్మ సిద్ధాంతం చుట్టూ తిరిగే డార్క్ కామెడీ

పాండిచ్చేరిని అడ్డాగా చేసుకుని అక్రమ సామ్రాజ్యాన్ని నడిపిస్తుంటాడు గ్యాంగ్‌స్టర్ డాన్‌ డ్రాకులా పాండ్యన్‌ (సూపర్‌ సుబ్బరాయన్‌). ఇతన్ని అంతం చేసి, తన సోదరుడి చావుకు ప్రతీకారం తీర్చుకోవాలని డాన్ నర్సింహారెడ్డి (అజయ్‌ ఘోష్‌) రూ. 5 కోట్లకు ఓ కిరాయి ముఠాతో డీల్ కుదుర్చుకుంటాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. కిరాయి ముఠా ట్రాప్‌లో పడబోయి, డ్రగ్స్ మత్తులో దారితప్పి పాండ్యన్ పొరపాటున రీటా (కీర్తి సురేశ్‌) ఇంటికి వస్తాడు. రీటా కుటుంబం (తల్లి చెల్లమ్మ - రాధికా శరత్‌ కుమార్‌)తో గొడవ జరగగా, అనుకోకుండా తల్లి కొట్టిన దెబ్బకు పాండ్యన్ అక్కడికక్కడే మరణిస్తాడు.

పాండ్యన్ మరణం తర్వాత, ఒక సాధారణ కుటుంబమైన రీటా ఫ్యామిలీ, ఆ శవాన్ని మాయం చేసేందుకు పడే పాట్లు, మరోవైపు ఆ శవం కోసం వేటాడుతున్న కిరాయి ముఠా, అలాగే తప్పిపోయిన తండ్రి జాడ వెతుకుతున్న పాండ్యన్ కొడుకు బాబీ పాండ్యన్‌ (సునీల్‌) రంగంలోకి దిగడంతో కథ ఉత్కంఠగా మారుతుంది. 'కర్మ ఎవరినీ విడిచిపెట్టదు' అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న ఈ కథ.. అనుకోని హత్య కారణంగా రీటా కుటుంబం గ్యాంగ్‌వార్, పోలీసుల నడుమ ఎలా ఇరుక్కుంది? తన తెలివితేటలతో వారందరి నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది? అనే అంశాల చుట్టూ తిరుగుతుంది.

ఎలా ఉందంటే.. 

'రివాల్వర్ రీటా' ఒక డార్క్ కామెడీ థ్రిల్లర్ గా మొదలైనా.. ప్రేక్షకులకు ఆ కామెడీ అనుభూతిని అందించడంలో విఫలమైందనే చెప్పాలి. 'దృశ్యం 2', 'కొలమావు కోకిల', 'మగలిర్ మట్టుమ్' వంటి చిత్రాల ఛాయలు ఈ కథనంలో కనిపిస్తాయి. దర్శకుడు తీసుకున్న 'కర్మ' సిద్ధాంతం అనే లైన్ వినడానికి బాగానే ఉన్నా, దానిని తెరపై ఆవిష్కరించే విధానం రొటీన్‌గా అనిపిస్తుందంటున్నారు ప్రేక్షకులు.  కథ, పాత్రల పరిచయం బాగానే ఉన్నా, పాండ్యన్ హత్య తర్వాత శవాన్ని దాచడానికి రీటా కుటుంబం పడే పాట్లు.. అనుకున్నంతగా నవ్వులు పూయించలేకపోయాయి. కేవలం రాధికా శరత్ కుమార్ కొన్ని సన్నివేశాలలో తన అమాయకత్వంతో నవ్వించే ప్రయత్నం చేశారు.

అసలైన ఛేజింగ్ డ్రామా..

సెకండ్ ఆఫ్  నుంచే అసలైన ఛేజింగ్ డ్రామా మొదలవుతుంది. అయితే ఇంటర్వెల్ తర్వాత వచ్చే కొన్ని చేజింగ్ సన్నివేశాలు, ఇతర గ్యాంగ్‌స్టర్ల ప్రయత్నాలు కొంచెం బోరింగ్‌గా సాగాయనే అభిప్రాయం ఉంది. డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా ఉండాల్సిన కథనం, అటు కామెడీని, ఇటు థ్రిల్‌ను పూర్తిస్థాయిలో పండించలేకపోయని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కథనం చివరికి వచ్చేసరికి కాస్త ఊపందుకుంటుంది. రీటా తన తెలివితేటలతో గ్యాంగ్‌స్టర్ గ్యాంగ్, పోలీసుల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునే తీరు ఉత్కంఠభరితంగా ఉంటుంది. పతాక ఘట్టంలో కీర్తి సురేష్ రివాల్వర్ పట్టుకునే తీరు టైటిల్‌కు న్యాయం చేసింది.

 కీర్తి సురేష్ వన్-మాన్ షో!

 రీటా పాత్రలో కీర్తి సురేష్ తన నటనతో ఆకట్టుకున్నారు. సినిమాలో కొత్తదనం లేకపోయినా, ఆమె తన పాత్రను చక్కగా పోషించారు. ముఖ్యంగా ద్వితీయార్థంలో యాక్షన్, డ్రామా సన్నివేశాలలో ఆమె నటన, కొన్ని సింగిల్-టేక్ డైలాగ్ సీన్స్‌లో తన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు బలం చేకూర్చింది. అయితే ఆమె నుంచి ఆశించే పూర్తిస్థాయి కొత్త కోణం మాత్రం ఈ చిత్రంలో కనిపించలేదు. ఇక తల్లి పాత్రలో రాధికా శరత్‌ కుమార్‌ కామెడీ టైమింగ్ అక్కడక్కడా బాగా పండింది. ఆమె అమాయకమైన చర్యలు, డైలాగులు కొంతవరకు నవ్వులు పూయించాయి. విలన్ పాత్రలో సునీల్ లుక్ కొత్తగా, సీరియస్‌గా ఉన్నా.. ఆయన పాత్ర పరిధి తక్కువగా అనిపిస్తుంది.  కామెడీ సీన్లలో రెడిన్  పంచ్‌లు, టైమింగ్ కొంతమేర నవ్వించాయి. అతని బాత్‌రూమ్ సీన్ బాగా వర్కౌట్ అయింది.  సూపర్ సుబ్బరాయన్, అజయ్ ఘోష్, జాన్ విజయ్ వంటి ఇతర నటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

అయితే కీర్తి సురేష్ ఆకట్టుకునే నటన, ద్వితీయార్థంలో కొన్ని ఉత్కంఠభరిత సన్నివేశాలు, రాధికా శరత్‌ కుమార్‌, రెడిన్ కింగ్స్లీ కామెడీ,   కొత్తదనం లేని కథాంశం ద్వితీయార్థంలో కొన్ని ఉత్కంఠభరిత సన్నివేశాలుకామెడీ, థ్రిల్ సరిగ్గా పండకపోవడం, సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ కొత్తదనం లేని కథాంశం, కామెడీ, థ్రిల్ సరిగ్గా పండకపోవడం, సాగదీత సన్నివేశాలు, కథనం ప్రేక్షకులను కాస్త నిరాశపరిచాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మొత్తానికి 'రివాల్వర్ రీటా' ఒక మంచి పాయింట్‌తో మొదలైనా, రొటీన్ కథనం, కామెడీ సరైన విధంగా పండకపోవడం వంటి కారణాల వల్ల ప్రేక్షకులకు పూర్తిస్థాయి థ్రిల్‌ను అందించలేకపోయింది. కీర్తి సురేష్ నటన కోసం, పతాక సన్నివేశాల కోసం ఈ చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు చెబుతున్నారు ప్రేక్షకులు.