రీవాల్యుయేషన్, సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజును మినహాయించాలి

రీవాల్యుయేషన్, సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజును మినహాయించాలి

ఫలితాల తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులు పరిస్థితులు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులు..మార్కులు తక్కువగా వచ్చాయనే బాధతో  ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. జీవితం యొక్క విలువను అర్థం చేసుకోవాలని..స్టూడెంట్స్ ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోవద్దని వారికి విజ్ఞప్తి చేశారు. రీవాల్యుయేషన్ , సప్లిమెంటరీ పరీక్షల ఫీజును మినహాయించాలని  తెలంగాణ సీఎంవోను డిమాండ్ చేశారు. ఇంటర్ లో మార్కులు తక్కువగా వచ్చాయని, ఫెయిల్ అయ్యారని పలు జిల్లాల్లో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.