బేగంపేట పీఎస్  ఇన్​స్పెక్టర్​కు రివార్డు

బేగంపేట పీఎస్  ఇన్​స్పెక్టర్​కు రివార్డు

సికింద్రాబాద్,వెలుగు : హత్య కేసుల్లో పకడ్బందీగా చార్జ్​షీట్లు వేసి నిందితులకు శిక్ష పడేలా చేసిన ఇన్​స్పెక్టర్లకు రాష్ర్ట డీజీపీ రివార్డులు, అప్రిసియేషన్​సర్టిఫికెట్లను మంగళవారం అందజేశారు.  బేగంపేట్ పోలీసుస్టేషన్ లో ఇన్​స్పెక్టర్​చిర్ర రామయ్య నందిగామలో..

మహంకాళి పీఎస్ లో ఇన్​స్పెక్టర్​పరశురామ్​దుబ్బాకలో విధులు నిర్వహిస్తున్న కాలంలో మర్డర్​కేసుల్లో అన్ని ఆధారాలతో కోర్టులో చార్జ్ షీట్ లు సమర్పించారు. దీంతో  వీరికి డీజీపీ రివార్డుతో పాటు ప్రసంశపత్రాన్ని  అందజేశారు.