డైరెక్టర్ రాంగోపాల్ వర్మ బంధువు మృతి

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ బంధువు మృతి

ప్రముఖ సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) బంధువు..  మురళి రాజు (70) మార్చి 7వ తేదీ ఉదయం అనారోగ్యంతో చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ భీమవరం చెందిన మురళి రాజు గతంలో సినీ నిర్మాతగా చేసి పలు వ్యాపారాలను కొనసాగించారు. మురళి రాజుకు కుమారుడు మంతెన మధు, కూతురు అంబికా ఉన్నారు. కుమారుడు మధు.. గజినీ వంటి సినిమాలతో పాటు తెలుగు, హింది, తమిళ భాషల్లో 34 సినిమాలకు పైగా నిర్మించారు. 

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నటులు అల్లు అర్జున్, డైరెక్టర్ క్రిష్, నిర్మాత బన్నీ వాసు తదితరులు మధురానగర్ లోని మురళి రాజు నివాసానికి వెళ్లి ఆయనకు నివాళులర్పించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు.