విజిల్ వాళ్ల నాన్న నుంచి నేర్చుకున్నట్టుంది.. బ్రాహ్మణిపై వర్మ సెటైర్లు

విజిల్ వాళ్ల నాన్న నుంచి నేర్చుకున్నట్టుంది.. బ్రాహ్మణిపై వర్మ సెటైర్లు

నారా బ్రాహ్మణిపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు. చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దాంలో బ్రాహ్మణి విజిల్‌ వేసి, డప్పు కొట్టిన వీడియోను పోస్ట్ చేసిన వర్మ ..  బ్రాహ్మణి ఓ చిన్నారిలా ఎంజాయ్ చేస్తున్నారని..  తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చినట్టున్నాయని ట్వీట్ చేశారు.  అలాగే విజిల్ ఊదడం  తన నాన్న నుంచి నేర్చుకున్నట్లున్నారేమో అంటూ  బాలకృష్ణ ఇటీవల అసెంబ్లీలో విజిల్ వేసిన ఫోటోను పోస్ట్ చేశారు.  ఏపీలో  ఐదు కోట్ల మందికి చెవులు బద్దలై E N T హాస్పిటల్స్ అన్నీ ఫుల్  అవుతున్నాయని వార్తలు రావడం నిజమేనా అని సెటైర్ వేశారు.

చంద్రబాబు అరెస్ట్ నునిరసిస్తూ  మోతమోగిద్దాం పేరుతో నిరసన కార్యక్రమానికి నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు సెప్టెంబర్ 30 రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు  ఏపీ ప్రజలు మోత మోగించాలని పిలుపునిచ్చారు.  ఎక్కడున్నా బయటకొచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో  కొట్టాలని లేదా విజిల్ వేయాలని కోరారు.  రోడ్లపైన ఉంటే హారన్ కొట్టాలన్నారు. ఇలా చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని చెప్పారు.