
మల్కాజిగిరి, వెలుగు: కరోనా మహమ్మారి వలన ఇబ్బందులు పడుతున్నపేదలకు నిత్యం సేవలు చేయడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు మైనంపల్లి సేవా సమితి నిర్వాహకులు. శనివారం మల్కాజిగిరిలోని ఓ ఫంక్షన్ హాలులో మైనంపల్లి సేవా సమితి ఆధ్వర్యంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే హనుమంతరావు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లులు పేదలకు, వలస కార్మికులు సుమారు 5 వందల మందికి నిత్యావసర సరుకులు అందించారు. అలాగే మల్కాజిగిరి పోలిస్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి నిత్యావసర వస్తువులను అందించారు.
ఈ సందర్భంగ వారు మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కంటి నిండా కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి నుండి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలంటే అందరూ ఇంట్లోనే ఉండాలన్నారు. నియోజవకర్గంలోని పేదలకు, వలస కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.