IND vs AUS : నెక్స్ట్ మ్యాచ్లో సెంచరీ పక్కా.. భారత్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకోవాలి

IND vs AUS : నెక్స్ట్ మ్యాచ్లో సెంచరీ పక్కా.. భారత్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకోవాలి

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న టెస్ట్ సిరీస్ లో విరాట్ కోహ్లీ పరుగులు సాధించడానికి ఇబ్బంది పడుతున్నాడు. కోహ్లీ బంతిని అంచనా వేయకపోవడం ఒక ఎత్తైతే.. ఎంపైరింగ్ తప్పిదాలు మరోఎత్తు. ఒక్క ఇన్నింగ్స్ లో (రెండో మ్యాచ్ లో 40 పరుగులు) తప్ప కోహ్లీ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నది ఏమీ లేదు. దీంతో కోహ్లీ బ్యాటింగ్ పై విమర్శకులు మరొకసారి కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంపై కోహ్లీకి ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అండగా నిలిచాడు. తన బ్యాటింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు విరాట్ కోహ్లీ ఎంత ముఖ్యమో తెలియజేశాడు.

‘ఈ సిరీస్ లో నేను ఎవరి ఏ జట్టు బ్యాట్స్ మెన్ ఫామ్ ను విమర్శించను. ఎందుకంటే ఈ సిరీస్ లో పిచ్ లు బ్యాటర్లకు సవాల్ గా మారాయి. బంతిని అంచనా వేయడం సరికదా.. డిఫెండ్ చేయడానికి తిప్పలు పడ్డారు. స్పిన్నర్లు చుక్కలు చూపించారు. ఇలాంటి టైంలో ఒకర్ని తప్పుబట్టడం సరికాదు. పరుగులు రాబట్టలేకపోతున్న విషయం కోహ్లీకి తెలుసు. జట్టుకు తాను ఎంత అవసరమో కూడా తనకు తెలుసు. విరాట్ మళ్లీ తప్పక పుంజుకుంటాడు. నెక్ట్స్ మ్యాచ్ లో సెంచరీ సాధిస్తాడు’ అని పాంటింగ్ అన్నాడు. అయితే, భారత్  డబ్ల్యూటీసీ  ఫైనల్ చేరాలంటే బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు అవసరమని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.