గాంధీ బొమ్మను కాల్చినందుకు బాధలేదు: పూజా పాండే

గాంధీ బొమ్మను కాల్చినందుకు బాధలేదు: పూజా పాండే

అలీగఢ్: మహాత్మ గాంధీని నాథూ రామ్ గాడ్సే హత్య చేసిన దృశ్యాన్ని మరోసారి చిత్రించి, గాంధీజీ రూపంలోని దిష్టిబొమ్మకు నిప్పు పెట్టిన హిందూ మహా సభ నేత పూజా శకున్ పాండేను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు భర్త అశోక్ పాటు, మరో 12 మందిపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు.

మహాత్మ గాంధీ వర్థంతి (జనవరి 30) నాడు దిష్టిబొమ్మలతో పూజా పాండే సహా మరికొందరు బాపూజీ హత్య నాటి దృశ్యాన్ని చిత్రించారు. ముందుగా నాథూరామ్ గాడ్సే విగ్రహానికి పూల మాల వేశారు. గాంధీజీ దిష్టి బొమ్మను గాడ్సే షూట్ చేస్తున్నట్లుగా తుపాకీతో కాల్చారు. ఆ తర్వాత నిప్పు పెట్టి దహనం చేశారు. ఈ ఘటన మొత్తం వీడియో రూపంలో వైరల్ అయింది. దీంతో పూజా పాండే, ఆమె భర్త అశోక్ పాండే పరారయ్యారు.

కోర్టులో హాజరు

నాటి నుంచి వారి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు వారిని నిన్న అలీగఢ్ లో అరెస్టు చేశారు. బుధవారం ఉదయం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా తాను చేసింది నేరం కాదని పూజా పాండే వాదించింది. రాజ్యాంగం తనకు ఇచ్చిన హక్కును వాడుకున్నానని చెప్పింది. గాంధీ బొమ్మను కాల్చినందుకు తానకు ఏ బాధ లేదని, ఇది దసరా నాడు రావణుడి విగ్రహం కాల్చడం లాంటిదేనని చెప్పింది.