వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ హీలియంలో రిలయన్స్​కు 21 శాతం వాటా

వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ హీలియంలో రిలయన్స్​కు 21 శాతం వాటా

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అమెరికాకు చెందిన​ హీలియం గ్యాస్ అన్వేషణ,  ఉత్పత్తి సంస్థ వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ హీలియంలో 21 శాతం వాటాను  12 మిలియన్​ డాలర్లకు (దాదాపు రూ.101 కోట్లకు) కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఈనెల 27న వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ హీలియం (డబ్ల్యూహెచ్ఐ)తో స్టాక్ కొనుగోలు ఒప్పందం కుదిరింది.   డబ్ల్యూహెచ్ఐ  జులై 2, 2021న యూఎస్​లో ఏర్పాటయింది. 

 2024లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది.  ఇది భూగర్భ జలాశయాల నుంచి హీలియం వాయువును ఉత్పత్తి చేస్తుంది.   హీలియంను మెడికల్​, ఏరోస్పేస్  ఏరోనాటిక్స్, ఎలక్ట్రానిక్స్ వంటి వాటిలో వాడతారు.