IPL 2024: చిన్న పిల్లాడికి రింకూ సింగ్ క్షమాపణలు...అసలేం జరిగిందంటే..?

IPL 2024: చిన్న పిల్లాడికి రింకూ సింగ్ క్షమాపణలు...అసలేం జరిగిందంటే..?

ఐపీఎల్ కు సమయం సన్నద్ధమైంది. క్రికెటర్లందరూ ప్రాక్టీస్ లో బిజీ అయిపోయారు. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలబడుతుంది. మరో పది రోజుల్లో మెగా టోర్నీకి రంగం సిద్ధం కాగా.. కోల్ కత్తా నైట్ రైడర్స్ ప్రాక్టీస్ క్యాంప్ లో అనూహ్య సంఘటన ఒకటి చోటు చేసుకుంది. 

కేకేఆర్ సరికొత్త ఫినిషర్ సిక్సులను అలవోకగా బాదేస్తాడని మనకి తెలిసిందే. అయితే ఇప్పుడు అతను సిక్సర్ కొట్టడమే పెద్ద సమస్యగా మారింది. నెట్స్ సెషన్‌లో రింకూ ప్రాక్టీస్ చేస్తూ ఒక బంతిని స్ట్రెయిట్ డ్రైవ్‌ ఆడాడు. ఈ బంతి కాస్త బౌండరీ వెలుపల ఉన్న యువకుడికి తగిలింది. రింకూ సింగ్ ఆ కుర్రాడి దగ్గరకు వెళ్లి..క్షమాపణలు చెప్పి ఆ బాలుడితో కాసేపు మాట్లాడి.. సంతకం చేసిన టోపీని అతనికి బహుమతిగా ఇచ్చాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతుంది. 

రింకూ సింగ్ 2023 ఐపీఎల్ సీజన్ ద్వారా బాగా వెలుగులోకి వచ్చాడు. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు దిగుతూ కేకేఆర్ జట్టుకు ప్రధాన బ్యాటర్ లా మారాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో యష్ దయాళ్ బౌలింగ్ లో చివరి 5 బంతులకు 28 పరుగులు చేయాల్సిన దశలో వరుసగా 5 సిక్సర్లు కొట్టి ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించాడు. ఈ సీజన్ ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన రింకూ.. అత్యంత నిలకడగా రాణిస్తున్నాడు.