నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'కాంతార: చాప్టర్ 1' రికార్డుల పరంపర కొనసాగుతోంది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.. ఆక్టోబర్ 2న విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 830 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది . వెయ్యి కోట్ల లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న బాలీవుడ్ మూవీ ' ఛావా' చిత్రాన్ని అధిగమించి బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది. ఈ చిత్రం విడుదలై 25 రోజులు దాటినా.. థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.
అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్..
'కాంతార: చాప్టర్ 1' థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు పోటెత్తుతున్న ఈ తరుణంలోనే నిర్మాతలు ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ పై అధికారికంగా హింట్ ఇవ్వడం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానున్నట్లు తెలియజేసింది.. ఇటీవల, ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ రిషబ్ శెట్టి యొక్క భయంకరమైన, దైవికమైన అవతారంలో ఉన్న కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, డిజిటల్ ప్రీమియర్ గురించి సంకేతాలు ఇచ్చింది.
ఫ్యాన్స్ మధ్య విభేదాలు..
అయితే, OTT విడుదల తేదీని ప్రైమ్ వీడియో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, డిజిటల్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, అభిమానులు మాత్రం రెండుగా విడిపోయారు. కొందరు సినిమాను ఇంట్లో కూర్చుని మరోసారి చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరికొందరు ఈ చిత్రం థియేటర్లలో ఇంకా మంచి వసూళ్లు సాధిస్తున్నందున థియేట్రికల్ రన్‌ను పొడిగించాలని కోరుతున్నారు. మరో వైపుఈ చిత్రాన్ని ఇంగ్లీష్ వెర్షన్స్ లో కూడా.. ఎంట్రీకి రెడీ అవుతోంది.
కథానేపథ్యం..
2022లో వచ్చిన 'కాంతార' చిత్రానికి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా కథ, వలసరాజ్యాల పూర్వం నాటి తీరప్రాంత కర్ణాటక నేపథ్యంలో సాగుతుంది. దైవ కోల లేదా భూత కోల సంప్రదాయం యొక్క మూలాలను, దాని ఆధ్యాత్మిక లోతును ఈ చిత్రం అద్భుతంగా ఆవిష్కరించింది. గిరిజన నాయకుడైన బెర్మే (రిషబ్ శెట్టి) తన ప్రజల విశ్వాసాలను, భూమిని అణచివేతకు గురిచేసే ధనిక వర్గానికి వ్యతిరేకంగా ఎలా పోరాడాడనేది ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం.
►ALSO READ | Bigg Boss Telugu 9 : గాసిప్ క్వీన్ రమ్య ఎలిమినేషన్ వెనుక అసలు కథ! సెలబ్రిటీ రేంజ్‌లో రెమ్యునరేషన్!
ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్, ప్రమోద్ శెట్టి ముఖ్య పాత్రలు పోషించారు. అజనీష్ లోక్‌నాథ్ అందించిన సంగీతం, అరవింద్ కశ్యప్ విజువల్స్ సినిమాకు ప్రాణం పోశాయి. నమ్మకం, జానపద కథలు, శక్తివంతమైన కథనం కలగలిసిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
