అలేఖ్య చిట్టి .. పచ్చళ్ల ఫేమ్ రమ్య మోక్షగా సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పచ్చళ్ల వివాదం .. ఆ తర్వాత ఫిట్ నెస్ వీడియోలతో ఇన్ స్టా్గ్రామ్ లో తెగ సెన్సేషన్ గా మారింది. బిగ్ బాస్ తెలుగు 9 హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి పెద్ద చర్చకు తెరలేపింది. షో మొదలైన ఐదో వారంలో దివ్వెల మాధురి, ఆయేషా జీనత్, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, శ్రీనివాస సాయిలతో కలిసి ఆమె హౌస్‌లోకి అడుగుపెట్టింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము.. గత వారం భరణి ఎలిమినేట్ కావడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ వారం బిగ్ బాస్ పెద్ద షాక్ ఇస్తూ.. రమ్య మోక్షను హౌస్ నుంచి బయటకు పంపించారు.
కోల్పోయిన క్రేజ్..
రమ్య మోక్ష రాకతో హౌస్‌లో ఒకసారిగా కొత్త ఉత్సాహం నెలకొంది. బయట షో గురించి, కంటెస్టెంట్ల గురించి ఉన్న అభిప్రాయాలను కుండబద్దలు కొట్టి.. మొదట్లో గాసిప్ క్వీన్‌గా హల్ చల్ చేసింది. తన గ్లామర్, ఫిట్‌నెస్‌తో అందరి దృష్టిని ప్రేక్షకులను ఆకర్షించింది. ఫిజికల్ టాస్క్‌ల్లో కూడా మగాళ్లతో పోటీ పడి సత్తా చాటుతానని కాన్ఫిడెంట్‌ను తీసుకువచ్చింది. అయితే నోటీ దురుసు, వ్యక్తిగతంగా పలువురు కంటెస్టెంట్స్ పై కామెంట్స్ చేయడం వంటి వాటితో పూర్తిగా నెగిటివిటీని మూటగట్టుకుంది.
అంచనాలు తలకిందులు..
అయితే, రమ్య హడావిడి కేవలం మొదటి రెండ్రోజులకే పరిమితమైంది. హౌస్‌లో ఉండి కూడా ఎలాంటి కంటెంట్ ఇవ్వలేకపోయింది. టాస్క్‌లను సీరియస్‌గా ఆడకపోవడం, ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ పూర్తిగా తగ్గించేయడం ఆమెకు మైనస్‌గా మారింది. కేవలం గుసగుసలకే పరిమితమై, ఆటలో చురుకుదనం కోల్పోయింది. రమ్య మోక్ష ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌ను ఒక ఊపు ఊపుతుందని ఆశించిన ప్రేక్షకులకు తీవ్ర నిరాను మిగిల్చింది. ఫలితంగా.. కేవలం రెండు వారాలకే ఆమె ప్రయాణం ముగిసింది. ఏడో వారం ఎలిమినేషన్‌లో రమ్య మోక్ష హౌస్ నుండి బయటకు వచ్చేసింది.
సెలబ్రిటీ రేంజ్ రెమ్యునరేషన్..
రమ్య మోక్ష ఎలిమినేషన్ కంటే, ఆమె అందుకున్న రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బయట ఆమెకున్న క్రేజ్, ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెకు సెలబ్రిటీల స్థాయిలో పారితోషికం ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. సాధారణంగా వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చే వారికి, ముఖ్యంగా కామనర్లకు వారానికి లక్షన్నర లోపు చెల్లిస్తారు. కానీ, రమ్య మోక్షకు మాత్రం వారానికి రూ. 2 లక్షల నుండి రూ.3 లక్షల మధ్య పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే, కేవలం రెండు వారాలకే ఆమె దాదాపు రూ.4 లక్షల నుండి రూ.5 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు వినిపిస్తోంది..
►ALSO READ | 12ARailwayColony: అల్లరి నరేష్ హర్రర్ మూవీ అప్డేట్.. థియేటర్లో పొలిమేర డైరెక్టర్ ప్రయోగం ఎప్పుడంటే?
ఇంత భారీగా చెల్లించిన నిర్వాహకుల అంచనాలు తలకిందులు కావడంతో, ప్రేక్షకుల నుంచి ఓట్లు కూడా తక్కువ పడ్డాయి. అంతే కాదు హౌస్‌లో కంటెంట్ ఇవ్వని కారణంగా ఆమెను త్వరగా ఎలిమినేట్ చేయక తప్పలేదు. రమ్య ఎలిమినేషన్ నిర్ణయాన్ని బిగ్ బాస్ అభిమానులు చాలా మంది సంతోషంగా స్వాగతించారు. సోషల్ మీడియాలో 'పచ్చళ్లు పెట్టుకో' అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. కెరీర్ సీరియస్‌గా తీసుకుంటానన్నావు ఇదేనా? అంటూ విమర్శిస్తున్నారు.
