IND vs ENG 2025: రిచర్డ్స్‌ను దాటేసిన పంత్.. ఇంగ్లాండ్‌లో టీమిండియా వికెట్ కీపర్ రికార్డుల మోత

IND vs ENG 2025: రిచర్డ్స్‌ను దాటేసిన పంత్.. ఇంగ్లాండ్‌లో టీమిండియా వికెట్ కీపర్ రికార్డుల మోత

ఇంగ్లాండ్ తో జరుగుతున్న లార్డ్స్ టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రికార్డుల మోత మోగించాడు. ఈ సిరీస్ లో అసాధారణ ఫామ్ తో చెలరేగుతూ దూసుకెళ్తున్నాడు. మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ బౌలర్లపై కౌంటర్ ఎటాక్ చేస్తూ 74 పరుగులు చేశాడు. పంత్ ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. రాహుల్ తో నాలుగో వికెట్ కు ఏకంగా 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు. పంత్ ఇన్నింగ్స్ కు పలు రికార్డ్స్ ను బ్రేక్ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

రిచర్డ్స్ రికార్డ్ బ్రేక్:

టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ పై అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును రిషబ్ పంత్ తన పేరిట లిఖించుకున్నాడు. మ్యాచ్ కు ముందు వరకు ఈ రికార్డ్ విండీస్ లెజెండరీ ఆటగాడు రిచర్డ్స్ (35) పేరిట ఉంది. ఈ మ్యాచ్ లో పంత్ రెండు సిక్సర్లు కొట్టడంతో 36 సిక్సర్లతో రిచర్డ్స్ ధాటి అగ్ర స్థానానికి చేరుకున్నాడు.

రోహిత్ రికార్డ్ సమం:

టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక బాదిన ఆటగాళ్ల లిస్ట్ లో పంత్ టీమిండియా మాజీ టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి రెండో స్థానానికి చేరుకున్నాడు. 88 సిక్సర్లతో రోహిత్, పంత్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. తొలి స్థానంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 90 సిక్సర్లతో టాప్ లో ఉన్నాడు. ఈ సిరీస్ ముగిసే లోపు అత్యధిక సిక్సర్లతో పంత్ టాప్ లోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. 

వికెట్ కీపర్ గా ఇంగ్లాండ్ లో అత్యధిక పరుగులు:

ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్ గా పంత్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్ పంత్ ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్ ల్లో 408 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండర్ (383) పేరిట ఉన్న ఈ రికార్డును పంత్ అధిగమించాడు. 350 పరుగులతో ఫిలిప్స్ మూడో స్థానంలో.. 349 పరుగులతో ధోనీ నాలుగో స్థానంలో ఉన్నారు.

►ALSO READ | IND vs ENG 2025: నిలకడగా జడేజా, నితీష్.. ఆధిక్యం దిశగా టీమిండియా