ఐపీఎల్‌‌‌‌కు పంత్ రెడీ 

ఐపీఎల్‌‌‌‌కు పంత్ రెడీ 
  • అన్ని మ్యాచ్‌‌‌‌లూ ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నాడు: పాంటింగ్

మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌: కారు యాక్సిడెంట్‌‌‌‌కు గురై చాన్నాళ్లుగా ఆటకు దూరమైన ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఈ సీజన్ ఐపీఎల్‌‌‌‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.  ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌  తరఫున మొత్తం ఐపీఎల్‌‌‌‌లో ఆడాలని పంత్  కాన్ఫిడెంట్‌‌‌‌గా ఉన్నాడని ఆ టీమ్  హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ రికీ పాంటింగ్ చెప్పాడు. వచ్చే సీజన్‌‌‌‌లో పంత్ కేవలం బ్యాటర్‌‌‌‌‌‌‌‌గానే బరిలోకి దిగుతాడని, కీపింగ్‌‌‌‌ చేయబోడన్నాడు.

2022 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన యాక్సిడెంట్‌‌‌‌లో తీవ్ర గాయాల పాలైన పంత్‌‌‌‌ పలు సర్జరీలు చేయించుకొని కోలుకున్నాడు. ‘ఐపీఎల్‌‌‌‌ ఆడేందుకు పంత్ చాలా కాన్ఫిడెంట్‌‌‌‌గా ఉన్నాడు. అయితే తను ఏ బాధ్యతలో ఆడతాడన్నది మాకు తెలియదు. టోర్నీకి మరో ఆరు వారాల సమయమే ఉంది. కాబట్టి ఈ సీజన్‌‌‌‌లో తను వికెట్‌‌‌‌ కీపింగ్ చేస్తాడని చెప్పలేం. తను పూర్తి సామర్థ్యంతో ఆడాలని కోరుకుంటున్నాం.

ఒకవేళ మొత్తం మ్యాచ్‌‌‌‌లకు కాకపోయినా కనీసం పదింటిలో ఆడినా మంచి విషయమే అవుతుంది. తనను అడిగితే మాత్రం అన్ని మ్యాచ్‌‌‌‌ల ఆడటంతో పాటు నాలుగో నంబర్‌‌‌‌‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌, కీపింగ్‌‌‌‌కు రెడీ అని చెబుతాడు. అంత డైనమిక్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ తను. పంత్‌‌‌‌ మా కెప్టెన్‌‌‌‌. గతేడాది అతని సేవలు కోల్పోయాం’ అని పాంటింగ్‌‌‌‌ చెప్పుకొచ్చాడు. పంత్‌‌‌‌ లేకపోవడంతో గత సీజన్‌‌‌‌లో ఢిల్లీకి వార్నర్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా వ్యవహరించాడు. ఒకవేళ ఈ సీజన్‌‌‌‌లో పంత్‌‌‌‌ కెప్టెన్సీకి రెడీగా లేకపోతే వార్నర్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌ను నడిపిస్తాడని పాంటింగ్‌‌‌‌ తెలిపాడు.