ఆకట్టుకున్న రిషి సునాక్ కూతురు కూచిపూడి ప్రదర్శన

ఆకట్టుకున్న రిషి సునాక్ కూతురు కూచిపూడి ప్రదర్శన

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూతురు అనౌష్క సునాక్ కూచిపూడి డాన్స్ పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. లండన్లో జరిగిన ఓ కార్యక్రమంలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చింది. 9 ఏండ్ల అనౌష్క కొంతకాలంగా కూచిపూడి నేర్చుకుంటోంది. తాజాగా రేంజ్ ఇంటర్నేషనల్ కూచిపూడి డాన్స్ ఫెస్టివల్ 2022లో 4 నుంచి 85ఏండ్ల వయసు కలిగిన 100మంది కళాకారులతో కలిసి పాల్గొంది. ఈ కార్యక్రమానికి రిషి సునాక్ భార్య అక్షతామూర్తి తన అత్తమామలతో కలిసి హాజరయ్యారు. 

బ్రిటన్ ప్రధాని సునాక్కు కృష్ణ, అనౌష్క సునాక్ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూతురు అక్షతామూర్తిని రిషి సునాక్ పెళ్లి చేసుకున్నారు. 42 ఏండ్ల వయసులో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రిషి చరిత్ర సృష్టించారు.