తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామానికి చెందిన తోట రిశ్వంత్‌వర్మ అండర్–17 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. మారుమూల గ్రామం నుంచి ఎంపిక కావడంతో కావడంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్న రిశ్వంత్‌కు పేరేంట్స్ నాగేశ్– సంధ్య, కోచ్ సురేశ్ ప్రోత్సాహం అందించారు. వారి సహకారంతో జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలలో ప్రతిభా చాటి ఇండియా క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఈనెల 30న నేపాల్‌లో జరగనున్న అండర్ 17 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో పాల్గొననున్నాడు. శుక్రవారం సర్పంచ్ దిడ్డి మోహన్ రావు, గ్రామస్తులు రిశ్వంత్ వర్మను ఘనంగా సన్మానించారు.
